![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో.... దీప దగ్గరికి గౌతమ్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. దీప కూడా తగ్గకుండా మాట్లాడుతుంది. గౌతమ్ వెళ్ళిపోయాక గౌతమ్ ఇలాంటి వాడా అని కాంచన, అనసూయ మాట్లాడుకుంటారు. నువ్వు గౌతమ్ విషయంలో ఏం చేసిన కూడా నాకు చెప్పాలని దీప దగ్గర కాంచన మాట తీసుకుంటుంది. ఇలాంటి వాడిని మళ్ళీ ఆ ఇంటికి అల్లుడు చేసుకోరు కదా అని అనసూయ అంటుంది. లేదు గౌతమ్ తనంతట తనే వద్దనుకున్నాడు కదా మళ్ళీ మా నాన్న ఈ పెళ్లి కి ఒప్పుకోడని కాంచన అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. అప్పుడే జ్యోత్స్నకి గౌతమ్ మెసేజ్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఇది నా దగ్గర ఏదో దాస్తుంది.. ముందు అది కనుక్కోవాలని అనుకుటుంది. ఆ తర్వాత పారిజాతం సత్తి పండుని కలుస్తుంది. నువ్వు రమ్య భర్త కాదని తెలుసు.. ఇప్పుడు నిజం చెప్పు అంటూ కొంతడబ్బు ఇస్తుంది. నేను రమ్య భర్త కాదు ఒకరు చెప్పమంటే చెప్పానని సత్తి పండు అంటాడు. ఎవరు వాళ్ళని పారిజాతం అడుగుతుంది. జ్యోత్స్న మేడమ్ అని అతను చెప్పగానే.. పారిజాతం షాక్ అవుతుంది. మరొక వైపు శ్రీధర్, కావేరి ఒక రెస్టారెంట్ కి వస్తారు అదే రెస్టారెంట్ కి జ్యోత్స్న, గౌతమ్ వస్తారు. వాళ్ళని చుసిన కావేరి అదేంటీ పెళ్లి కాన్సిల్ అయింది మళ్ళీ కలిసి వస్తున్నారని అనుకుటుంది. శ్రీధర్ పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతాడు. కావేరి కాబిన్ పక్కనే వాళ్ళు కూర్చుంటారు. దీప గురించి మాట్లాడుకుంటారు అప్పుడే పారిజాతం రావడం చుసిన జ్యోత్స్న.. గౌతమ్ ని అక్కడ నుండి పంపిస్తుంది. గౌతమ్ కాల్ చేస్తే చిరాకు పడ్డావ్.. ఇప్పుడు ఏకంగా కలిసావని పారిజాతం అంటుంది. ఇప్పుడే సత్తి పండుని కలిసాను జరిగిందంతా చెప్పాడు అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఇది రెస్టారెంట్ అంటూ పారిజాతాన్ని పక్కకి తీసుకొని వెళ్తుంది జ్యోత్స్న. వాళ్ళ వెనకాలే కావేరి వెళ్తుంది. గౌతమ్ తప్పు చేసాడు. ఈ పెళ్లి దీప ద్వారా ఆగిపోతే అందరు దీపని తిడతారు. అందుకే గౌతమ్ తప్పు చేసాడని తెలిసిన సైలెంట్ గా ఉన్నానంటూ జరిగింది మొత్తం చెప్తుంది. ఇదంతా ఎందుకని పారిజాతం అడుగుతుంది. బావ జీవితం లో నుండి దీప వెళ్లిపోతుంది.. బావ నాకు మాత్రమే సొంతమని జ్యోత్స్న అంటుంది. ఈలోపు ఇంట్లో వాళ్లకి తెలిస్తే అని పారిజాతం అంటుంది. తెలిసేలోపు అంత అయిపోతుందని జ్యోత్స్న అంటుంది. అదంతా విన్న కావేరి వెంటనే ఈ విషయం దీపకి చెప్పాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |